Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ..! తన భార్య పుట్టిన రోజే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై అని భార్యకు మెసేజ్ చేసి తన భార్య పుట్టిన రోజునే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై అని భార్యకు మెసేజ్ చేసి తన భార్య పుట్టిన రోజునే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్(40) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య రాధికతో కలిసి హైదరాబాద్–కూకట్పల్లి దేవినగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే భార్య రాధిక జన్మదిన వేడుకల అనంతరం అందరూ కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకోగా, తాను రాలేనని చెప్పి రమేష్ ఇంట్లో ఉండిపోయాడు.
రాధిక తన అక్క, తమ్ముడితో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లగా, “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై” అంటూ రమేష్ రాధిక ఫోన్‌కు మెసేజ్ పంపాడు. ఆందోళనతో ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రమేష్‌ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

