సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది.
దుండిగల్, ఏప్రిల్ 30: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని మర్కాపురానికి చెందిన సీతారామ్కు నంద్యాలకు చెందిన యువతితో 2018లో వివాహమైంది. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అవడంతో సీతారామ్ హైదరాబాద్లోని బాచుపల్లిలో కాపురం పెట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్యాన్ని.. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే వార్త కకావికలం చేసింది.
కేసులో కొత్త ట్విస్ట్..!
ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సీతారాంను మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వెనుక పెద్ద కుట్ర ఉందా..? భర్తను అడ్డు తొలగించుకోవడానికి నిందితులే కావాలని ఆ వీడియోలను సీతారామ్కు చేరేలా చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి రెండు నెలలు గడిచినా కేసులో పురోగతి లేకపోవడం పట్ల భాదిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నది. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సీతారాం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రైవేట్ వీడియోలు..!
తన భార్య పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చూసిన సీతారామ్.. మనోవేదనకు గురై ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 పేజీల లేఖరాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తదనంతరం సీతారాం తండ్రి బాచుపల్లి పీఎస్లో 11 మందిపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఏప్రిల్ 21న కేవలం సీతారామ్ భార్య, ఆమె ప్రియుడిని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టు పది రోజుల ముందే జరిగినప్పటికీ పోలీసులు ఎందుకు రహస్యంగా ఉంచారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన తొమ్మిది మంది నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

