విమాన టికెట్లు.. 10.88 లక్షల మోసం
అమెరికా నుంచి అక్కా, బావ వస్తున్నారని, వాళ్ల కోసం విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.10.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీర్‌పేటకు చెందిన బాధితుడి అక్కా, బావ అమెరికాలో ఉన్నారు. వారు ఇండియాకు వచ్చేందుకు అవసరమైన ఆరు విమాన టికెట్ల
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి అక్కా, బావ వస్తున్నారని, వాళ్ల కోసం విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.10.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీర్‌పేటకు చెందిన బాధితుడి అక్కా, బావ అమెరికాలో ఉన్నారు. వారు ఇండియాకు వచ్చేందుకు అవసరమైన ఆరు విమాన టికెట్ల కోసం బాధితుడు సోషల్ మీడియా గ్రూప్‌లో వచ్చిన ఓ నంబర్‌కు కాల్చేసి, ఆకాశ్ జాజు అనే వ్యక్తితో మాట్లాడి వివరాలు తీసుకున్నాడు.
ఆకాశ్ జాజు సూచన మేరకు విమాన టికెట్ల కోసం రూ.10.88 లక్షలు అతడి ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. బాధితుడు బుధవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

