మేడ్చల్, ఏప్రిల్ 16 : స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దస్తావేజు లేఖరులు ఆందోళన బాట పట్టారు. మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఘట్కేసర్ సబ్‌రిజిస్టర్ కార్యాలయం ఎదుట..
ఘట్కేసర్, ఏప్రిల్ 16: స్లాట్ బుకింగ్వి విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఘట్కేసర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. టీడీడబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు నరేశ్ గౌడ్, రాజేష్, శ్రీకాంత్ గౌడ్, సుధాకర్, లక్ష్మణ్ చారి, బకృష్ణ కుమార్, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట..
కీసర, ఏప్రిల్ 16: స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దుచేయాలని కోరుతూ డాక్యుమెంట్ రైటర్స్ కీసర సబ్ రిజిసా్ర్టర్ కార్యాలయం ఎదుట బుధవారం పెద్ద ఎత్తునధర్నాకు దిగారు. అనంతరం సబ్ రిజిసా్ర్టర్కు వినతపం అందజేశారు.
నారపల్లి సబ్రిజిసా్ర్టర్ కార్యాలయంలో..
పోచారం,ఏప్రిల్16: రిజిస్టేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలంటూపోచారం మున్సిపాలిటీ నారపల్లి సబ్రిజిసా్ర్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ రెండవ రోజు ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్,ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గౌడ్,నారపల్లి దస్తావేజు లేఖరులు శ్రీనివాస్,నరేందర్ గౌడ్, బాలకృష్ణ, హరికృష్ణ, మధుసుదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో..
నేరేడ్మెట్, ఏప్రిల్ 16:రిజిస్టేష్రన్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని మల్కాజిగిరి డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మల్కాజిగిరి సబ్ రిజిస్టేష్రన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మల్కాజిగిరి డాక్యుమెంటరీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి చేకొండ నరేష్‌బాబు, ఫరూక్, సూర్యకుమారి, ప్రభాకర్, హిమజ, జ్యోతి, శంకర్, రూప, సుధీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.