సిటీబ్యూరో, డిసెంబరు 16 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చిన మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా నగరంలో విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను సోమవారం అరెస్టు చేశారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన తరుణ్‌వర్మ మధ్యప్రదేశ్ నుంచి ఎండీపీఎల్ నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ తక్కువ ధరకు తీసుకువచ్చి నగరంలో అధిక ధరలకు సరఫరా చేస్తున్నాడు.
సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు తరుణ్‌వర్మ కారును తనిఖీ చేయగా 40 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు లభించాయి. నిందితుడిని విచారించగా రాజేంద్రనగర్‌కు చెందిన సురేందర్, షేక్‌పేటకు చెందిన క్రాంతి, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన నాగార్జున, రవీందర్‌గౌడ్, నాగరాజులు అక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు. నిందితులను అరెస్టు చేసి రూ.2.5లక్షల విలువ చేసే 157 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లతో పాటు రెండు కార్లు, ద్విచక్రవాహనం, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.