విశ్వనగరంగా మారుతున్న నగరానికి మరో మణిహారం రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులకు ముందడుగు పడింది. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్‌పోర్టు మెట్రో పనులను అధికారులు పట్టాలెక్కిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం మెట్రో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి రాయదుర్గం ప్రారంభ మెట్రోస్టేషన్‌కు సంబంధించిన స్థలాన్ని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం హెచ్ఏఎంఎల్ సీనియర్ ఇంజినీర్ల బృందంతో కలిసి రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ దాకా దాదాపు 10 కి.మీ పొడవునా ఉన్న ఎయిర్ పోర్ట్ మెట్రో మార్గాన్ని క్షేత్ర స్థాయిలో కాలినడకన పరిశీలించారు. ఈ ప్రయాణంలో ఇంజినీర్లకు, సర్వే బృందాలకు ఎన్వీఎస్ రెడ్డి కీలక సూచనలు ఇస్తూ, పలు ఆదేశాలు జారీ చేశారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎయిర్ పోర్ట్ వరకు చేపట్టనున్న మెట్రో రైలు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మెట్రో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి రాయదుర్గంలో పర్యటించి మెట్రో స్టేషన్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం హెచ్ఏఎంఎల్ సీనియర్ ఇంజినీర్ల బృందంతో కలిసి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దాదాపు 10 కి.మీ పొడవునా ఉన్న ఈ మార్గంలో కాలినడకన నడుస్తూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ పనులు చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో ఈ డేటా కీలకమవుతుందని అన్నారు. సర్వే బృందంలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్రప్రసాద్‌నాయక్, ఇతర సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచనలు