SIT : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhageerath)పై నమోదైన పోక్సో కేసులో విచారణను సిట్(SIT) వేగవంతం చేసింది. సిట్ చీఫ్ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ (Ritiraj Gaikwad) కేసు దర్యాప్తునకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా బాధితురాలికి న్యాయం చేస్తామని ఆమె పేర్కొన్నారు.
పోక్సో కేసులో సాయి భగీరథ్‌ను అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ సిట్ బృందం దూకుడు పెంచింది. సోమవారం పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రితిరాజ్ గైక్వాడ్ అక్కడ డీసీపీ, ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. ఏసీపీ, సీఐతోనూ మాట్లాడిన ఆమె కేసు దర్యాప్తు స్థితిని, కేసు వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ఇప్పటివరకూ చట్ట ప్రకారం ఆధారాలు సేకరించాం. ఫోన్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు తీసుకోవాల్సి ఉంది. మరోసారి బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేస్తాం. సాధ్యమైనంత త్వరగా బాధిరాలికి న్యాయం చేస్తాం’ అని వెల్లడించారు.
అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం🙄 https://t.co/ZflpOzJ3m9 pic.twitter.com/IuC1JlFBVn
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026
బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ గైక్వాడ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.
పేట్ బాషీరాబాద్ పీఎస్‌కు చేరుకున్న కూకట్పల్లి డీసీపీ రితిరాజ్
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం
SHO క్యాబిన్లో డీసీపీతో పాటు ఏసీపీల మీటింగ్
కాసేపట్లో మైనర్ భాదితురాలి స్టేట్మెంట్ రికార్డ్ నమోదు చేసే అవకాశం https://t.co/GZiOZUVSIu pic.twitter.com/SkqyuYHi6p
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026