Singareni | సింగరేణిలో రాష్ట్రప్రభుత్వం వాటా 51 శాతం.. కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం ఉందని.. బీజెపి , కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని లాభాల బాట పట్టించాం.. సింగరేణిలో కారుణ్య నియామకాలను కేసీఆర్ ఇచ్చారు.. జీవో 76 క్రింద వేలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.
ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేసీఆర్ కృషి ఉంది. గనుల వేలానికి సంబంధించిన ఎంఎంటీఆర్ బిల్లును నేను ఎంపీగా వ్యతిరేకించా..బీఆర్ఎస్ ఆ చట్టానికి వ్యతిరేకంగా లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది.. సింగరేణిని వేలం పాట పెడితే సింగరేణి నష్ట పోతుందని ఆనాడే రాజ్యసభలో మా పార్టీ తరపున ఆనాడు కేశవరావు మాట్లాడిండు. సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని సిరుల గనిగా ఉంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో కుంభకోణాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు.
సైట్ విజిట్ సర్టిఫికెట్ తో OB టెండర్ లో కుంభకోణం చేశారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు 16 వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సింగరేణిలో మొత్తం 16 వేల కోట్ల కుంభ కోణాలు జరిగాయన్నారు. మా నాయకుడు హరీష్ రావు బొగ్గు నిల్వల చూసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత సింగరేణిలో డీజిల్ కుంభకోణానికి తెరలేపారు.పంపకాల విషయంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పంచాయతీ.ఆ తర్వాత నైని బొగ్గు బ్లాక్ టెండర్ ను రద్దు చేశారు.బడే బాయ్, చోటే బాయ్ మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి .అందరు కలిసి సింగరేణిని ముంచుతున్నారని ఫైర్ అయ్యారు.
తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సాధించామని బీజేపీ, కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSAను పంపారు.
సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై CBI ఎందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఆధారాలతో సహా మా నాయకుడు హరీష్ రావు సింగరేణి కుంభకోణం బయటపెడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాయి బాయి అందుకే సింగరేణిలో కుంభకోణాలకు పాల్పడుతున్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి కిషన్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదు. అన్ని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ లను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.