మేడ్చల్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) / మేడ్చల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. 2018 నుంచి వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ప్రశంసిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా వ్యవసాయ సాగుకు 10,827 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనికి ప్రతి నెల 46.03 మెగావాట్ల విద్యుత్‌ను అన్నదాతలకు ఉచితంగా అందిస్తున్నారు.
సౌలతులు బాగున్నాయి
నామమాత్రపు ఖర్చులతో వ్యవసాయం చేస్తున్నాం. కరెంట్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. సాగుకు రైతుబంధు పథకంతో నగదును అందిస్తున్నది. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి సౌలతులు బాగున్నాయి.
– దండి బోయిన లక్ష్మయ్య, కీసర
కేసీఆర్‌తోనే ఎవుసం అభివృద్ధి
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతున్నది. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఇచ్చిన ప్రభుత్వాలు గతంలో లేవు. వ్యవసాయానికి ఇంతటి ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– ఇంద్రారెడ్డి, ఎదులాబాద్
ఉచిత విద్యుత్ ఓ చరిత్ర
24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం ఓ చరిత్ర. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ యం రైతులకు వరం. వ్యవసాయం చేయ డం సంతోషంగా ఉంది.
– దేశమంతారెడ్డి, కీసర
దిగుబడి పెరిగింది
అప్పట్లో వ్యవసాయం చేస్తే ఖర్చులు బాగా అ య్యేవి. వ్యవసాయం గురి ంచి తెలిసిన ముఖ్యమం త్రి కేసీఆర్ సారు మాకు అన్ని రకాల సౌలతులు కల్పిస్తున్నారు. 24 గంటలు ఉచితంగా కరెంటుతో పంటల దిగుబడి పెరిగింది. సల్లగా బతుకుతున్నాం.
–బోదరి సత్తయ్య, మేడ్చల్
కేసీఆర్ వచ్చినంకనే..
గతంలో ఆరేడు గం టల కరెంట్ కూడా రాకపోయేది. పంటలకు నీళ్లందక నష్టపోవాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ వచ్చినంకనే మేలు జరుగుతున్నది. రైతుబంధు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కరెంట్ బిల్లు రూపాయి కూడా తీసుకోవడంలేదు.
– యాదగిరి,పూడూరు, మేడ్చల్ మండలం