జూబ్లీహిల్స్,నవంబర్17: హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు నగరంలోని ఇతర గురుద్వారాలకు చెందిన గురుద్వారా ప్రెసిడెంట్లు బీఆర్ఎస్ పార్టీ మాజీ నగర అధ్యక్షుడు కట్టల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ సిక్కు సంఘం ఆధ్వర్యంలో నాంపల్లిలో ఈ నెల 27న నిర్వహించనున్న జగత్పిత శ్రీగురునానక్ దేవ్‌జీ మహారాజ్ 554వ జయంతి వేడుకలకు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఆల్ తెలంగాణ గురుద్వారా సాహెబాన్ చైర్మన్ ఎస్.గురుచరణ్ సింగ్ బగ్గా ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి మంజిత్ సింగ్పాలా, ఉపాధ్యక్షులు జస్పాల్ సింగ్ తుటేజా, రవీందర్ సింగ్ శర్మ, గగన్ సింగ్ కోహ్లి, ప్రీతమ్ సింగ్, బల్దేవ్ సింగ్, భగీందర్ సింగ్, ఇందేర్ సింగ్, కుల్దీప సింగ్, హర్పల్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.