ఎక్కడి స్తంభాలు అక్కడే!
అభివృద్ధి పనులు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి కానీ అవే పనులు ప్రజల భద్రతకు ముప్పుగా మారితే బాధ్యత తీసుకునేవారెవరు.. ప్రస్తుతం నగరంలోని కీలకమైన కేబీఆర్ పార్క్ వద్ద పరిస్థితి ఇది.
- కేబుళ్ల కోసం తీసిన గుంతలు పూడ్చలేదు
- పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి
- ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం
- విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో పనుల్లో తీవ్ర ఆలస్యం
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి కానీ అవే పనులు ప్రజల భద్రతకు ముప్పుగా మారితే బాధ్యత తీసుకునేవారెవరు.. ప్రస్తుతం నగరంలోని కీలకమైన కేబీఆర్ పార్క్ వద్ద పరిస్థితి ఇది. నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో గుంతలు తవ్వారు.. రోడ్డుపై విద్యుత్ స్తంభాలు చిందరవందరగా పడేయడంతో పాటు అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌ను ప్రమాదకరంగా వదిలేశారు. ఆ ప్రాంతంలో మొన్నటివరకు వన్‌వే అమలు చేశారు. చివరకు ప్రణాళికల్లో మార్పులతో పనులన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణాసౌకర్యం కల్పిస్తామంటూ కేబీఆర్ పార్కు వద్ద ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యుత్ నెట్వర్క్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ మాస్టర్ ప్లాన్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కేబీఆర్ పార్కు చౌరస్తాలో ఈ పనులకోసం తీసిన గోతులు కొద్దిరోజులుగా ఎలాంటి పనులు లేకపోవడంతో యథావిధిగా వదిలేశారు. పనులను వేగవంతం చేయాలంటూ ఉన్నతాధికారులు ప్రత్యేకించి ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో ..మిగతా IIవ పేజీలో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కడి స్తంభాలు అక్కడే!
ఏఐ దెబ్బ.. ‘గెట్టి ఇమేజెస్’ దివాలా
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

