డంపింగ్ యార్డు వద్దు
ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపే చెత్త డంపింగ్ యార్డు సిద్ధా పూర్ గ్రామంలో వద్దే..వద్దని స్థానికులు తేల్చి చెప్పారు. సిద్ధ్దాపూర్లోని సర్వేనంబర్లు 252, 278, 361లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆర్డీవో సరిత, కొత్తూరు తహసీల్దార్లకు మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చొరవతో వినతిపత్రాలు సమర్పించారు.
- వినతిపత్రాలు అందజేసిన సిద్ధాపూర్ గ్రామస్తులు
కొత్తూరు: ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపే చెత్త డంపింగ్ యార్డు సిద్ధా పూర్ గ్రామంలో వద్దే..వద్దని స్థానికులు తేల్చి చెప్పారు. సిద్ధ్దాపూర్లోని సర్వేనంబర్లు 252, 278, 361లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆర్డీవో సరిత, కొత్తూరు తహసీల్దార్లకు మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చొరవతో వినతిపత్రాలు సమర్పించారు.
డంపింగ్ యార్డు ఏర్పాటుతో ప్రజారోగ్యం, వ్యవసాయం, భూగర్భ జలాలు, అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు, పచ్చదనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు యాదగిరి, సీనియర్ నాయకులు దేవేందర్‌యాదవ్, గోపాల్‌నాయక్, మిట్ట్టూనాయక్, మాజీ ఎంపీటీసీ బాలయ్య, యాదయ్య, రాములునాయక్, లక్ష్మణ్‌నాయక్, కోట్యానాయక్, గోపీనాయక్, బిచ్చానాయక్, జంగయ్య, మోహన్‌నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

