Shocking accident : రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసి పక్కన పోయేవాళ్ల ప్రాణాలు తీసేవాళ్ల సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతున్నది. మద్యం మత్తులో కొందరు, ఆకతాయి చేష్టలతో ఇంకొందరు ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇటీవల పుణెలో, బెంగళూరులో, ఢిల్లీలో ఇలాంటి ఘటనలు కలకలం రేపాయి. తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. స్థానికంగా ఎన్జీవో కాలనీలో జరిగిన ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక యువతి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. కారు స్పీడ్‌కు ఆ యువతి గాల్లో బంతిలా ఎగిరిపడింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాదం వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో కూడా ఇలా ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడం అవసరమా..? అని మండిపడుతున్నారు. కింది వీడియోలో ప్రమాదం దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్
వనస్థలిపురంలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ యువతిని ఢీకొట్టిన కారు
వనస్థలిపురం NGOs కాలనీ వివేకానంద పార్క్ ముందు రాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ యువతిని ఢీ కొట్టిన కారు.. యువతికి తీవ్ర గాయాలు.
వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు. pic.twitter.com/cP1FwbZFWK
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2024