అభాగ్యురాలికి భరోసా..
చేతిలో రెండేళ్ల చిన్న పిల్లాడు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఉన్నామనే సోయి లేదు. కానీ నవమాసాలు మోసిన ఆ చిన్న పిల్లాడితో మానసిక రోగి అయినా ఆ తల్లి చత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నది. ఆమె మానసిక పరిస్థితిని గమనించిన ఘరీయాబాద్లోని సఖీ కేంద్రం ప్రతినిధులు తల్లి, బిడ్డను అక్కడి స్టేట్ హోంలో సంరక్షించారు.
- బిలాస్పూర్ టూ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు తరలింపు
- మానసిక రోగిని సంరక్షించిన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్
సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : చేతిలో రెండేళ్ల చిన్న పిల్లాడు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఉన్నామనే సోయి లేదు. కానీ నవమాసాలు మోసిన ఆ చిన్న పిల్లాడితో మానసిక రోగి అయినా ఆ తల్లి చత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నది. ఆమె మానసిక పరిస్థితిని గమనించిన ఘరీయాబాద్లోని సఖీ కేంద్రం ప్రతినిధులు తల్లి, బిడ్డను అక్కడి స్టేట్ హోంలో సంరక్షించారు. అయితే ఆమె తెలుగు మాట్లాడుతుందని గ్రహించి అక్కడి అధికారులు.. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీకి సమాచారం అందించారు.
జస్టిస్ పి.శాంకోషే ఆదేశాలతో ఆథారిటీ సభ్యులు గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్, మహిళా కానిస్టేబుల్ స్వాతి, వెన్నెలాదేవి బృందం చత్తీస్ఘడ్ చేరుకుని, హర్షిత(హరిత రాజా)ను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. హర్షిత మానసిక స్థితిని పరిశీలించిన అధికారులు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మెరుగైన వైద్యం కోసం చేర్చారు. రెండేళ్ల పిల్లాడిని అమీర్‌పేట్‌లోని ఎట్ హోంకు తరలించినట్లుగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. అయితే ఆచూకీ తెలిసిన వారు హైకోర్టు ప్రధాన కార్యాలయంలోని లీగల్ సర్వీసెస్ కార్యాలయాన్ని గానీ, లేదా 040-23446723 ద్వారా సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

