Hyderabad | చార్మినార్, ఏప్రిల్ 4: కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్ వెళ్లిన వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ప్రాంతంలో నివసించే షబ్బీర్ అలీ కూతురు కర్ణాటక బీదర్లో నివసిస్తుంది.
రంజాన్ పండగ సందర్భంగా తల్లి ఇంటికి వచ్చిన ఆమె చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా ప్రాంతంలో కొత్త బట్టలు కొనుగోళ్ల కోసం షబ్బీర్ అలీతో సహా కుటుంబ సభ్యులందరు వచ్చారు. షబ్బీర్ అలీ మానసిక, చెవిటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని సమీపంలోని హోటల్ వద్ద కూర్చోబెట్టి.. షాపింగ్ కోసం వెళ్లారు. కొద్ది సమయం తరువాత తిరిగి వచ్చి చూడగా షబ్బీర్ అలీ అక్కడ కనిపించక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక బంధువుల వద్ద వాకబు చేశారు. అయినా షబ్బీర్ అలీ సమాచారం ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సౌమ్య తెలిపారు. వృద్ధుడు మానసిక, చెవిటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. షబ్బీర్ అలీని ఎవరైనా గుర్తిస్తే చార్మినార్ పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.