శివారులో పకడ్బందీగా మురుగునీటి నిర్వహణ..!
ఫిర్యాదుల పరిష్కారంలో 90శాతానికి పైగా అచివ్మెంట్
గడిచిన ఆరు నెలల్లో నిర్వహణకు రూ.76.85 కోట్లు వెచ్చింపు
సమస్యల పరిష్కారానికి కస్టమర్ కేర్ నంబరు 155313
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను తీసుకున్న జలమండలి ఎక్కడ మురుగు నీరు పొంగిపొర్లకుండా చర్యలు తీసుకుంటున్నది. స్థానికులు అందించిన ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపుతున్నది. నెలవారీగా దాదాపుగా 90శాతంకు పైగా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి గత నెల 30వ తేదీ వరకు 8 డివిజన్లలోని 406 చోట్ల పనులకు రూ.76.85కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
66 డివిజన్ల పరిధిలోని 3600 కిలోమీటర్ల మేర ఉన్న మురుగునీటి వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేసేందుకు వార్డు కార్యాలయాల్లో ప్రత్యేకంగా రిజిస్టర్ను ఏర్పాటు చేసి వెంటనే పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కస్టమర్ కేర్ నంబర్ 155313ను ఏర్పాటు చేశారు.
ఏడాదికి సీవరేజీ నిర్వహణకు ఖర్చు అంచనా