అంబర్పేట, జూన్ 2 : బాగ్ అంబర్పేట డివిజన్, స్ట్రీట్ నంబర్-15 అంటే స్థానిక ప్రభుత్వ పట్టణ ప్రాథమిక దవాఖానకు ఎదురుగా ఉన్న గల్లీలో గత నాలుగు నెలలుగా నల్లా నీరు కలుషితమై వస్తున్నాయి. వీటినే వినియోగిస్తున్న బస్తీ వాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఈ విషయాన్ని సంబంధిత వాటర్వర్క్స్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలిపినా.. శాశ్వత పరిష్కారం చూపడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.