హైదరాబాద్: నాంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు గాయపడ్డారు. దీంతో కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో (Drunk and Drive) ఉన్నాడని గుర్తించిన స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
గురువారం తెల్లవారుజామున నాంపల్లిలోని రెడ్‌హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు.. అతడు మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించి చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.