Hyderabad |బంజారాహిల్స్, జూన్ 11: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఏడుగురిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కేశవరాయినిపేట గ్రామానికి చెందిన కుమ్మెత నరేందర్ రెడ్డి(30) బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి వ్యభిచార గృహంపై దాడులు చేశారు. నిర్వాహకుడు నరేందర్ రెడ్డి, హౌజ్ కీపింగ్ చేస్తున్న ఆనంద్ కుమార్(30), పనిమనిషి రాముల్ కుమార్(26), విటులు అయ్యన్ కోడిశ్వరన్(62), ఉశ్కేల్వర్ శ్రీనివాస్ (51), నరేందర్ కుమార్ (38)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం నాడు రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు నలుగురు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిర్వాహకుల నుంచి రూ.26,500 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.