కుత్బుల్లాపూర్, సెప్టెంబర్3 : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు సమీప ప్రాంతంలో మరో మూడు పోలింగ్బూత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే మేలు కలుగుతుందని మాజీ సర్పంచ్ జెమ్మి గమణిదేవేందర్ ప్రజావాణిలో జిల్లా అధికార ంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్పందించి కొంపల్లిలోని జయభేరి కాలనీ పీఎస్ఎన్ స్కూల్లో రెండు బూత్లు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మరో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం పట్ల మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జెమ్మి నాగమణిదేవేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయా కేంద్రాల వద్ద జరిగిన ఓటింగ్ నమోదు ప్రక్రియను సందర్శించడంతో స్థానికులు సంతోషించారు. తమ ఫిర్యాదుకు స్పందించి ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించారని, కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.