మల్కాజిగిరి, జూన్ 16: నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సఫిల్గుడా మినీ ట్యాంక్‌బండ్, అల్వాల్ కొత్తచెరువు మీద మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న గౌడ్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా గాయకుడు గద్దర్ వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు.