Service Now | అమెరికన్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ హైదరాబాద్లో తన రెండో అతి పెద్ద కార్యాలయాలన్ని ప్రారంభించింది. నగరంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. దేశంలో గత పదేళ్లుగా సేవలను అందిస్తున్న కంపెనీ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఎంచుకోవడం ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యతనేనని జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా కంపెనీల ఏర్పాటుకు, నిర్వహణకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని జయేశ్ రంజన్ పేర్కొన్నారు.