సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు అందించే సేవలతో పోలీస్ సిబ్బందికి గుర్తిం పు లభిస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. 2023వ సంవత్సరంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 138మందికి ఉత్తమ సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందు లో 58 ఉత్కృష్ట, 80 సేవా పతకాలు ఉన్నా యి.
శనివారం కమిషనరేట్ కార్యాలయంలోని మెయిన్ కన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పథకాలను సిబ్బందికి సీపీ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పో లీస్ శాఖలో విధులు నిర్వహించడం, అందు లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎలాంటి రిమార్కులు లేకుండా పతకాలు పొందడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో జా యింట్ సీపీ నారాయణ్ నాయక్, డీసీపీ రవిచందన్రెడ్డి, అదనపు డీసీపీ షమీర్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.