తెలంగాణభవన్‌లో శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, వెంకటరెడ్డి, నవతారెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, సంగారెడ్డి, హరీశ్, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.