సిటీబ్యూరో, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ) : సీనియర్ జర్నలిస్ట్, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌ జింగ్ సొసైటీ సభ్యులు చెరుకూరి రంగయ్య నాయు డు(82) బుధవారం ఉదయం హైదరాబాద్లో మృతి చెందారు.
ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మీ, కూతురు హిమబిందు ఉన్నారు. ఆయన స్వస్థలం ఏపీ, చిత్తూరు జిల్లా పాకాల. 50 ఏళ్లపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు. ఆయన మృతిపై పలువురు జర్నలిస్టులు, సొసైటీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.