మెహిదీపట్నం, డిసెంబర్ 14: జీవితంలో జరిగిన సంఘటనలు తప్పుదారి పట్టించడంతో డ్రగ్స్ విక్రయదారులుగా మారిన ముగ్గురిని మాసాట్ట్యాంక్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ బృందాలతో కలిసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్గిరి నేరేడ్మెట్లో నివసించే చిరుమామిళ్ల బాలాజీ (32) పాల వ్యాపారం చేసి అప్పుల పాలయ్యాడు. వీటి నుంచి బయట పడటానికి సులువుగా డబ్బులు సంపాదించాలని డ్రగ్స్ అమ్మకాలను ప్రారంభించాడు.
ఆంధ్రపదేశ్, ప్రకాశం జిల్లా, పెర్నమిట్టా ప్రాంతానికి చెందిన తన సమీప బంధువు కార్తీక్ అలియస్ అలెక్స్(37), మేడ్చల్ జిల్లా జీడిమెట్లకు చెందిన తాండ్ర దీపక్(29)లతో కలిసి బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో అమ్ముతున్నారు. ఈ సమాచారం అందుకున్న హెచ్‌న్యూ, టాస్క్‌ఫోర్స్ బృందాలు వీరి కదలికలపై నిఘా పెట్టి ఆదివారం మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరివద్ద నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, ఓ కారు, ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ డీసీపీ గైక్వాడ్ వైభవ్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.