హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా దిగుమతి చేస్తున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను(Cannabis chocolates) ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ కట్టడిలో భాగంగా ప్రతి శనివారం రాత్రి శంషాబాద్(Shamshabad) ప్రాంతాల్లో జరిగే పార్టీలు, ఈవెంట్లపై ఎక్సైజ్ పోలీసులతో డీటిఎఫ్ ఫోర్స్ తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ.7 లక్షల విలువం చేసే 1.65 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుడ్డాయి. ద్విచక్ర వాహనంపై నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన బియాస్ టూ వీలర్ పై అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనంతోపాటు ఆతడి వద్దఉన్న చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.