బంజారాహిల్స్, ఏప్రిల్ 22: ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటర్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్,ఎర్రగడ్డ,యూసుఫ్‌గూడ డివిజన్లకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మాగంటి కార్యాలయానికి వచ్చి మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు చేశారు.
విధిలేని పరిస్థితిలో మోటర్ల ద్వారా నీటిని పట్టుకుంటుంటే జలమండలి అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు బస్తీల్లోకి వచ్చి వాటిని సీజ్ చేస్తున్నారని మహిళలు వాపోయారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్,దేదీప్యరావు, సంజీవ్, కృష్ణమోహన్, జావెద్, లియాఖత్, కేఎన్.రెడ్డి, అరుణ్, రాకేశ్ పాల్గొన్నారు.