సిటీబ్యూరో, మార్చి 8(నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సిటీపోలీస్ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద రన్ఫర్యాక్షన్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హాజరై జెండా ఊపి 5కె, 2కె రన్‌ను ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ మహిళలలో ఆత్మైస్థెర్యం పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ నగరపోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న18 వేల సిబ్బందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, క్రైమ్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ డేవిస్, అడ్మిన్ జాయింట్ సీపీ పరిమళ హానానూతన్, డీసీపీలు స్నేహా మెహరా, రక్షితాకృష్ణమూర్తి, రశ్మి పెరుమాల్, శిల్పావల్లి, లావణ్యనాయక్, ధార కవిత, శ్వేత, విజయ్‌కుమార్, బాలస్వామి, చైతన్యకుమార్, రాహుల్ హెడ్గే, చంద్రమోహన్, వైవిఎస్ సుధీంద్ర, ఎన్ అశోక్‌కుమార్, ఆర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ది ఒబెస్ట్రీక్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ గైనకాలజికల్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ మైదానం వద్ద ధీరా పేరుతో వాకథాన్ నిర్వహించారు.