పహాడి షరీఫ్, ఏప్రిల్ 26: దేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు సాధించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. నేర నియంత్రణకు నిఘా నేత్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వై ఏ ఆర్ కన్వెన్షన్ హాల్ లో శనివారం సీపీ సుధీర్ బాబు 855 సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాచకొండ కమిషనరేట్ గత ఆరు నెలలుగా నేరాల నియంత్రణలో ముందువరుసలో ఉందన్నారు. సీసీ కెమెరాలు పోలీసులకు, ప్రజలకు అనేక రకాలుగా ప్రయోజనాన్ని అందిస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాలను అనేక సందర్బల్లో పరిష్కరించామని వెల్లడించారు. ఇటీవల మల్కాజిగిరిలో ఓ యువతి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా.. స్టేషన్ అధికారులు సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి జైలుకు తరలించామని తెలిపారు.
మరో ఘటనలో మహేశ్వరంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడని భావించామని.. సీసీ ఫుటేజ్ ద్వారా హత్య కేసుగా తేలిందన్నారు. స్నేహితులే స్నేహితుడిని హత్య చేసి తప్పించుకోవడానికి యత్నించారని తెలిపారు. సీసీ కెమెరాలు ఉంటే ఆ ప్రాంతంలో నేరస్తులు నేరం చేయడానికి భయపడుతురన్నారని తెలిపారు. సీసీ కెమెరాలు వినియోగంలోకి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్‌ను కోర్ట్ లలో సాక్ష్యాలుగా సమర్పించడం వల్ల నేరస్తులకు త్వరతగతిన శిక్షలు పడుతున్నాయన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు నెలల అత్యంత తక్కువ సమయంలో 57 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయన్నారు. సీసీ కెమెరాలు ఇరువై నాలుగు గంటలు పనిచేస్తూ పోలీసులకు, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు. లండన్ లో రైల్వే స్టేషన్ లో జరిగిన బాంబు దాడి నిందితులను లండన్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారానే గుర్తించి అదుపులోకి తీసుకున్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకున్నామని వెల్లడించారు. ప్రజలు, నాయకులు, అధికారులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాల నియంత్రణకు సహకరించాలన్నారు.
ఏప్రిల్ మాసంలోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,140 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. జల్ పల్లి మున్సిపాలిటి కమిషనర్ మున్సిపాలిటి పరిధిలో సీసీ కెమెరాలకు ఇరువై లక్షలు కేటాయిస్తానన్నారని తెలిపారు. అనంతరం సీసీ కెమెరాల దాతలకు కమిషనర్ మెమెంటోలు అందజేశారు, ఈ కార్యక్రమంలో మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీలు లక్ష్మి కాంత్ రెడ్డి, కేవీపీ రాజు, బాలపూర్ ఇన్స్పెక్టర్, సుధాకర్, పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, ఏప్రిల్ 26 .ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు . మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ నెంబర్ సులేమాన్ గ్రామంలో ఉచితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయనను సీపీ శాలువాలతో సన్మానించి మెమొంటోను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలకపాత్రని వహిస్తాయని తెలిపారు. 1 సీసీ కెమెరా 100 పోలీస్తో సమానం అని చెప్పారు. దోపిడీ దొంగతనాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు .సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు సహకరించాలని కోరారు. ప్రజలు రద్దీ ప్రదేశంలో ఖచ్చితంగా సీసీ కెమెరా ఉండాలన్నారు. షాపుల్లో రైస్ మిల్లు లలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం డివిజన్ డీసీపీ సునీతా రెడ్డి, ఏసీబీ లక్ష్మీకాంతరెడ్డి, మైనార్టీ నాయకులు ఆసిఫ్ అలీ, పోలీసులు పాల్గొన్నారు.