మహానగరంలో అతివలకు రక్షణ లేకుండాపోతున్నది. ఐటీ కారిడార్‌లో జరిగిన లైంగికదాడి ఘటనతో మరోసారి హైదరాబాద్‌లో మహిళల భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా లైంగిక దాడులు, దాడి యత్నాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం నేరాలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. విజుబుల్ పోలీసింగ్‌ను పూర్తిగా మర్చిపోయారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా? లేదా? అని పరిశీలించే నాథుడే లేడు. డయల్ 100 ఫోన్ చేస్తే..సిబ్బంది ఎంత సేపట్లో బాధితుల వద్దకు చేరుకుంటున్నారనే విషయాన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నది. మహిళా భద్రత ప్రశ్నార్థకమవుతున్నది.
– సిటీబ్యూరో
Congress Govt | సైబరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి తరువాత ఆటో డ్రైవర్ యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. మహిళల భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి వారానికో ఆందోళన కల్గించే ఘటన జరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లలోని చాలా పోలీస్స్టేషన్ల పరిధిలో అధికారులు నిద్రమత్తులో ఉన్నా.. ఉన్నతాధికారులు వారి పనితీరు ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
నగరంలో వేలాది ఆటోలు, క్యాబ్‌లు తిరుగుతున్నాయి. ఎనీ టైం ధైర్యంగా ఆటోలు, క్యాబ్‌లు బుక్ చేసుకొని భద్రతగా ప్రయాణించే వాతావారణంలో గతంలో ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నేరాలు పెరగడంతో పాటు శాంతి భద్రతలు గాలికొదిలేశారు. దీంతో పోలీసుల నిఘా తగ్గడంతో నేర స్వభావం ఉన్న వాళ్లు రెచ్చిపోతున్నారు. జూలైలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో ఒకే రోజు నాలుగు లైంగికదాడి ఘటనలు జరిగాయి. శాంతి భద్రతలను, నేరాలను అదుపు చేస్తూ నగరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో కీలక భూమిక పోషించే పోలీసు వ్యవస్థపై ఇటీవల జరుగుతున్న ఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
నగరంలో ఘటనలివీ!