సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే మెస్సీ గోట్ టూర్ లైవ్ ఈవెంట్ ఫుట్‌బాల్ మ్యాచ్ కు 2500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బందోబస్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్టేడియంలోకి గేట్ నంబర్- 1 ద్వారా ఆటగాళ్లు, వీవీఐపీలకు మాత్రమే అనుమతి ఉం టుందని అన్నారు. స్టేడియంతోపాటు స్టేడి యం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఐటీ సెల్ ఏసీపీ నేతృత్వంలోని బృందం నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తుందన్నారు. బాం బు డిస్పోజబుల్ బృందాలు, అక్టోపస్, మౌంటెడ్ పోలీస్, వజ్రా, ఎస్ఓటీ, ఫైర్ ఫైట్ స్కాడ్ తదితర బృందాలు బందోబస్తులో ఉంటాయన్నారు. పాస్‌లు, టికెట్లు ఉన్న వారికే స్టేడియంలోకి అనుమతి ఉంటుందన్నారు. టికెట్లు సాఫ్ట్ కాపీస్ పంపిస్తారని, అవి వారిసెల్ఫోన్కు క్యూర్ కోడ్ వస్తుందన్నారు, క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి స్టేడియంలోకి వెళ్లాలని సూచించారు.
పాస్ హోల్డర్స్‌కు ఫిజికల్ పాసులు బార్‌కోడ్స్‌తో ఉంటాయన్నారు, వాటిని జిరాక్స్ తీసి లోపలకి వచ్చేందుకు ప్రయత్నిస్తే పట్టుబడుతార ని, అలాంటివారికి అనుమతి ఉండదన్నారు. స్టేడియం మొత్తం 13 గేట్లలో ప్రత్యేక బందో బ స్తును ఏర్పాటు చేశామని, కంట్రోల్‌కు ఐదు పెట్రోలింగ్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్టేడి యానికి వచ్చే అన్ని మార్గాల్లో సైన్‌బోర్డులు ఉన్నాయన్నారు. స్టేడియం లోకి ల్యాప్‌టాప్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమె రా, సిగరెట్, మ్యాచ్ బాక్స్, గొడుగు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లైటర్స్, షార్ప్ మెటల్స్, ప్లాస్టిక్ వస్తువులు, బైనోక్యూలర్స్, పెన్స్, బ్యాటరీ, హెల్మెట్స్, ఫర్ఫ్యూమ్స్, బ్యాగ్స్, బయట నుంచి తినే వస్తువులను లోపలికి అనుమతించరని చెప్పారు. ప్రేక్షకుల కోసం మూడు గం టల ముందే అంటే సాయంత్రం 4 గంటల నుంచే గేట్లు తెరుస్తారని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు..
శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఎల్బీనగర్, ఘట్కేసర్, సికింద్రాబాద్, నాచారం, రామంతాపూర్ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలను ఉప్పల్ స్టేడియం వైపు నుంచి కాకుండా మ రో మార్గంలో మళ్లిస్తున్నట్లు వివరించారు. సాధారణ పౌరులు స్టేడియం బయట ఉప్పల్ నుంచి హబ్సిగూడ మధ్య పెంజియన్, టీజీఐఏఎల్ఏ, ఎల్ఎఫ్జేసీ, మున్సిపల్‌గ్రౌండ్ లో, ఉప్పల్ నుంచి రామంతాపూర్ రూట్లో జైన్పార్కింగ్, సాండ్ అడ్డ, మోడ్రన్ బేకరీ, ఈనాడు ఆఫీస్, వారు ఫార్మ వద్ద తమ వా హనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. పాస్‌లు కల్గి ఉన్న వారు మాత్రమే స్టేడియం లోపలి వైపు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.