గోల్నాక, జనవరి 16: చైనా మాంజా విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. శుక్రవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. అంబర్పేట, కాచిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 2 వందల చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చైనా మాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.
ఘట్కేసర్: చైనామాంజా విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ కు చెందిన సాయికుమార్, శివకుమార్, సా యి చరణ్ చైనా మాంజా అమ్ముతున్నా రు. పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.