Cyberabad | సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంటల్ సీబీటీ పరీక్షల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబరు 2నుంచి బీఎన్ఎస్ 163సెక్షన్(144సెక్షన్) విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరంలో 5లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిషేధమని, పరీక్షా కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. డిసెంబర్ 2, 3, 7, 8వ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.