School Bus Overturns | హైదరాబాద్ నగర పరిధి కాటేదాన్లో ఓ పైవేటు పాఠశాలలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం పిల్లలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నది. బస్సు బోల్తాపడిన సమయంలో బస్లో దాదాపు 40 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని సమాచారం. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. బస్ బోల్తాపడడానికి కారణం బ్రేక్ ఫెయిల్ కారణమని, దాంతోనే అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.