సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ప్రమాదకరంగా మారిన శిథిల భవనాల కూల్చివేతలపై బల్దియా స్పెషల్ డ్రైవ్ నత్తనడకన సాగుతోంది. వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు సర్కిళ్ల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గతేడాది నోటీసులకు స్పందించని 252 శిథిల భవనాలు, ఇటీవల గుర్తించిన 284 నిర్మాణాలు కలిపి 536 భవన యాజమానులకు నోటీసులు ఇచ్చారు.
ఇందులో దాదాపు 125 మంది భవనాల యజమానాలకు నచ్చజెప్పి ఖాళీ చేయించారు. 34 చో ట్ల శిథిల భవనాలను కూల్చివేశారు. 41 చోట్ల భవనాలకు మరమ్మతులు చేపట్టా రు. ఒకచోట భవనాన్ని సీజ్ చేశారు. మిగిలిన కట్టడాలకు సంబంధించి డ్రైవ్ కొనసాగుతుందని, చార్మినార్, సికింద్రాబాద్, గోషామహల్ సర్కిళ్ల పరిధిలో కట్టడాలపై రానున్న 10 రోజుల్లోగా డ్రైవ్ పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా పనులు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.