పాస్‌పోర్టు త్వరగా ఇప్పిస్తామంటూ మోసాలు
పాస్‌పోర్టు దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... షహీన్ బేగం సుల్తానా తన మనువడికి పాస్‌పోర్టు కోసం 2025 జూన్‌లో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
- నలుగురు వ్యక్తుల ముఠా అరెస్ట్
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టు దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… షహీన్ బేగం సుల్తానా తన మనువడికి పాస్‌పోర్టు కోసం 2025 జూన్‌లో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
అయితే దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో 2025 నవంబర్‌లో ఆర్పీవో కార్యాలయానికి వెళ్లారు. పాస్‌పోర్టు కార్యాలయం వద్ద శివరాత్రి సిద్దులు అనే వ్యక్తి ఆమెను కలిశాడు. తాము పాస్‌పోర్టును వేగంగా ఇప్పిస్తామంటూ నమ్మబలికి, రూ. 6 వేల నగదు వసూలు చేశారు. ఇక మీరు పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లవద్దని, మీరు వెళ్లి వాకబు చేస్తే పాస్‌పోర్టు ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఆమెను భయపెట్టాడు.
అయితే రోజులు గడుస్తున్నా పాస్‌పోర్టు రాలేదు, దీంతో ఈనెల 4న సిద్దులును బాధితురాలు సంప్రదించగా, మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. అదనంగా డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు అవుతాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి, పాస్‌పోర్టు కార్యాలయం వద్ద అమాయకులను మోసం చేస్తున్న శివరాత్రి సిద్దులుతోపాటు అతని అనుచరులు తమ్ముల వెంకటేష్, వరికుప్పల అశ్విన్‌కుమార్, పల్లెపు దీపక్‌లను అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

