రవీంద్రభారతి, ఫిబ్రవరి 3: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెం ట్ ఇచ్చినా భారత పార్లమెంట్లో చర్చ జరగకుండా రాష్ర్టాలలో వర్గీకరణ చేయకూడదని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జె.చెన్నయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సో మవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ల సంఘాల జేఏసీ చైర్మన్ జె.చెన్నయ్య మా ట్లాడుతూ దళిత జాతులను సామాజికంగా, రాజకీయంగా అణచివేసి బానిసలుగా చేసుకోవడానికి మనువాద కేంద్ర, రాష్ట్ర పాలకు లు, దోపిడీ కులాల పార్టీలు కుట్రలు చేశాయన్నారు. ప్రధానంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాదాన్ని ధ్వంసం చేయడానికి ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగతో చేతులు కలిపి మ నువాద పార్టీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల హక్కులను కాలరాయడం కోసమే సుప్రీం కోర్టు ద్వారా నరేంద్ర మోదీ సర్కార్ తీర్పు ఇప్పించారని ఆరోపణలు చేశారు.
ఈ నెల 7వ తేదీన మంద కృష్ణ మాదిగ చేపట్టిన లక్ష డప్పులు, వేయి గొంతుకలు కార్యక్రమం సందర్భంగా మాలలకు చావు డప్పు కొడుతామని చేసుకుంటున్న ప్రచారాన్ని మాల సం ఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మాలలకు చావు డప్పు కాదని, డప్పులు కొట్టాల్సిం ది నరేంద్ర మోదీకి, కిషన్ రెడ్డికి, వెంకయ్య నాయుడికి కొట్టాలని ఆయన చెప్పారు. ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ వర్గీకరణ కోసం అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం, వర్గీకరణపై ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదని, వర్గీకరణ అంశం యావత్ దళిత కులాల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేస్తామని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వర్గీకరణపై చర్చిస్తామని చెప్పడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చిందే మాలల ఓట్ల ద్వారా అని, సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, తక్షణమే వర్గీకర ణ అంశాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. బేర బాలకిషన్, జంగా శ్రీనివాస్, భుజంగ రావు, మాల జేఏసీ నేతలు పాల్గొన్నారు.