ముషీరాబాద్, నవంబర్ 11: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్మిక నేత ఎస్బీ మోహన్‌రెడ్డి తనయుడు, సామాజిక వేత్త ఎస్బి వాసుదేవరెడ్డి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంతో బీఆర్ఎస్ పార్టీలో చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ముఠా జయసింహ, సయ్యద్ అస్లం, రమేష్‌చారి, నాగులు యాదవ్, వెంకట్రామ్రెడ్డి, హమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారని, నిత్యం జనం మధ్య ఉండే ముఠా గోపాల్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించుకోనున్నట్లు చెప్పారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని భావిస్తున్నారని అన్నారు.