Saroor Nagar | ఆర్కేపురం, మార్చి 11: సరూర్‌నగర్ డివిజన్ సర్వే 24లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్న కోరారు. ఈ మేరకు మంగళవారం సరూర్‌నగర్ తహసీల్దార్ వేణుగోపాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్ పరిధి సర్వేనెంబర్ 24లోని ప్రభుత్వ భూమి విషయంలో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జాకు గురికాకుండా చూడాలన్నారు. ప్రజలకు చెందిన ఈ భూములు అక్రమంగా ఇతరుల చేతికి వెళ్లకుండా కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని తెలిపారు. ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద అర్హులైన ప్రజలందరికీ నివాసం అందించాలన్నారు.