కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం అస్తవ్యస్తం
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో నగర పారిశుధ్యం అధ్వానంగా మారిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఖైరతాబాద్ డివిజన్లోని రాజ్నగర్ నాలాను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాలాలో వ్యర్థాలు, గడ్డి, చెట్లు విపరీతంగా పెరగడం వల్ల వచ్చే వానాకాలంలో బస్తీ ముంపునకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు.
- రాజ్నగర్ నాలాను పరిశీలించిన బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, మార్చి 31: కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో నగర పారిశుధ్యం అధ్వానంగా మారిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఖైరతాబాద్ డివిజన్లోని రాజ్నగర్ నాలాను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాలాలో వ్యర్థాలు, గడ్డి, చెట్లు విపరీతంగా పెరగడం వల్ల వచ్చే వానాకాలంలో బస్తీ ముంపునకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నా నాలాల డీసిల్టింగ్ కోసం అధికారులు మాత్రం చొరవ చూపడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో నాలాలను పూడిక తీసేవారని, కాని ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో నాలాలను పట్టించుకోవడం లేదని, పారిశుధ్యాన్ని పట్టించుకునే వాడే లేడని విమర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

