హైదరాబాద్: పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలని సంధ్య కన్వెన్షన్ ఎండీ ఎస్. శ్రీధర్‌రావు దాఖలు చేసిన ఎనిమిది పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో తీర్పు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం ప్రకటించారు. సివిల్ వివాదంలో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.
ఫ్లాట్ల కొనుగోలు కేసు వినియోగదారుల ఫోరంలో ఉందన్నారు. ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీధర్‌రావుపై 17 కేసులు ఉన్నాయని, నేరాభియోగాలు తీవ్రమైనవని, కేసుల కొట్టివేత ఉత్తర్వులు జారీ వద్దని వాదించారు.