అభివృద్ధిలో సనత్‌నగర్ అగ్రస్థానం : మంత్రి తలసాని
బన్సీలాల్‌పేట్ : సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నెలబెట్టామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్‌పేట్ డివిజన్ పరిధిలోని పద్మారావునగర్, భోలక్‌పూర్, బోయిగూడ, గాంధీనగర్ ప్రాంతాలలో 3.82 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ కే.హేమలతతో కలిసి ప్రారంభించారు.
పద్మారావునగర్‌లోని ఎన్టిఆర్ విగ్రహం వద్ద వీడిసీసీ రోడ్డు, బాపూజినగర్లో కమ్యూనిటి హాలు అదనపు అంతస్తు నిర్మాణం, అభినవనగర్ కాలనీలో విడిసిసి రోడ్డు, భోలక్‌పూర్‌లో విడిసిసి రోడ్డు, గాంధీనగర్ కాలనీలో విడిసిసి రోడ్డు, ఆంజనేయ కాలనీలో విడిసిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అన్ని కాలనీలు, బస్తీలలో మంత్రి రాక సందర్భంగా పూలు చల్లుతూ అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. తమ ప్రాంతంలోని సమస్యలను చెప్పగానే స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రమణారెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు ఆంజనేయులు, ప్రవీణ్, సికింద్రాబాద్ తహసిల్దార్ బాలశంకర్, టీఆర్ఎస్ నాయకులు జీ.పవన్‌కుమార్ గౌడ్, కే.లక్ష్మిపతి, వెంకటేశన్ రాజు, ఏసూరి మహేశ్, జీకే కాలనీ అధ్యక్షుడు కేఎం.కృష్ణ, కార్యదర్శి నర్సింగ్‌రావు, గాంధీనగర్ కాలనీ కార్యదర్శి రవికాంత్, బాపూజినగర్ కాలనీ అధ్యక్షుడు బాలకృష్ణ, అభిననవనగర్ కాలనీ అధ్యక్షుడు రాజేశ్ గౌడ్, బెల్వదేర్ గార్డెన్స్ అద్యక్షుడు జగ్గయ్య, ఎవర్గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేశన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటాపురం కాలనీ అధ్యక్షుడు సంతోశ్రెడ్డిలు పాల్గొన్నారు.

మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో :
‘మన బస్తీ-మన బడి’ పథకంలో భాగంగా పద్మారావునగర్‌లోని మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 19 లక్షల రూపాయలతో పాఠశాలకు మౌళిక సదుపాయాలను కల్పించే పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ హేమలతలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సర్కారు బడులకు రాబోయే రోజుల్లో మహర్దశ రాబోతుందని ఆయన అన్నారు. పాఠశాల ప్రహరీగోడ నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, డిజిటల్ తరగతులు, తాగునీటి వసతి, ఫర్నీచర్ సమకూర్చడం లాంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. డిప్యూటి ఈఓ సామ్యుల్రాజు, పాఠశాల హెచ్ఎం ఉమాదేవి, పద్మారావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాల్‌రెడ్డి, చక్రధర్‌యాదవ్, ఎస్ఎంసీ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

