మార్చి 1న హెచ్ఎండీఏ భూముల విక్రయం
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన మేడ్చల్ మలాజిగిరి జిల్లాలోని ఐదు ల్యాండ్ పార్సిల్స్ ప్రీ బిడ్ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించారు.
- మూడు జిల్లాల్లో ముగిసిన ప్రీ బిడ్ సమావేశాలు
- ఆన్లైన్లోనే అమ్మకాలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన మేడ్చల్ మలాజిగిరి జిల్లాలోని ఐదు ల్యాండ్ పార్సిల్స్ ప్రీ బిడ్ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీవో)కె.గంగాధర్ భూముల వివరాలు, ఆన్లైన్లో విక్రయ సమాచారాన్ని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.
రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం మండలంలో 2 చోట్ల ల్యాండ్ పార్సెల్స్ ఉండగా, మలాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో 4, ఘట్కేసర్ మండలంలో 1 చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం పరిధిలో 16, ఆర్సీ పురం మండలంలో 6, జిన్నారంలో 1చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయని వివరించారు. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుకు ఆసక్తి కనబస్తున్నారని తెలిపారు. మార్చి 1న మొత్తం 38 ల్యాండ్ పార్సిల్స్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోందని తెలిపారు. సమావేశంలో మేడిపల్లి తహశీల్దార్ మహిపాల్ రెడ్డి, హెచ్ఎండీఏ డీఏవో శోభారాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

