మాదాపూర్, సెప్టెంబర్ 3: ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ మైండ్ స్పేస్‌లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఇందులో 2500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 1500 మంది ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే కంపెనీ యాజమాన్యం వారిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో బాధితులు మంగళవారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించగా వారు ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఈఓడబ్ల్యూ (ఎకానమిక్ అఫెన్సిస్ వింగ్)లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అనంతరం ఉద్యోగులు రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.