సైదాబాద్, నవంబర్ 8 : బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ కథనం ప్రకారం…కాచిగూడ పార్ధివాడకు చెందిన యువకుడు (21) సైదాబాద్ సింగరేణికాలనీలో నివసించే సమీప బంధువుల ఇంటికి తరుచూ వస్తున్నాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలిక పై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె పై లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు రోజులుగా బాలిక ముభావంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అడగడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.