హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచందర్ రావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. 700 మంది బాధితుల నుంచి సుమారు రూ. 800 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. పూర్ణచందర్ రావును అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.
రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాహితీ ఇన్ ఫ్రా, అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం పేరుతో ప్రీ-లాంచ్ ఆఫర్లను ప్రకటించి, భారీగా డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్లోని అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో శర్వాణి ఎలైట్ వంటి ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చి, 655 మందికి పైగా కస్టమర్ల నుంచి రూ. 248.27 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే, డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని, దీంతో మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రూ.126 కోట్ల విలువైన 21 స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి పూర్ణచందర్రావు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాకుండా రూ. 50 కోట్ల నగదు లావాదేవీలను హవాలా మార్గంలో మళ్లించినట్లు చార్జిషీట్ లో పేరొంది.
ఈడీ గతంలోనూ ఈ కేసులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ భూదాటి లక్ష్మీనారాయణను అరెస్టు చేసింది. సాహితీ సంస్థకు సంబంధించిన రూ. 161.50 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసింది. ఇప్పుడు పూర్ణచందసాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచందర్ రావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచందర్ రావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ర్ రావు అరెస్టుతో ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి.