SV Ramarao | రవీంద్ర భారతి, మార్చి 7 : తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో శోభ ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో స్వర చక్రవర్తి పెండ్యాల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావుకు పెండ్యాల స్మారక పురస్కారం, చలనచిత్ర లక్ష్య లక్షణ విద్వాన్మతాను వర్తి బిరుదును ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవ పెద్ది సురేష్, భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ వంశీ రామరాజు, లంక లక్ష్మీనారాయణలు విచ్చేసి జ్యోతి ప్రజలను చేసి రామారావుకు అతిథుల చేతుల మీదుగా పెండ్యాల స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పెండ్యాల గొప్ప సినీ సంగీత స్వర చక్రవర్తి అని కొనియాడి ఎస్వీ రామారావుకు పురస్కారాన్నిబహుకరించడం ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు శోభారాణి, పెండ్యాల కూతుళ్లు సుజాత, వనజ, అతిథి గాయకులు బాలకామేశ్వరరావు, మధుర సుధాకర్, అంబాల శ్రీకాంత్, నాగేశ్వరరావు, మల్లాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.