రంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. జిల్లాలోని శివారు ప్రాంతాల రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ అవుతున్న ది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో వ్యవసా యం చేయడంలేదన్న సాకుతో రాష్ట్ర ప్రభు త్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని నిలిపేయగా.. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆ తొమ్మిది మండలాల్లో సాగవుతున్న వరి, కూరగాయల పంటలకు సంబంధించిన పూర్తి ఆధారాలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించి.. రైతుభరోసా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. శివారు మండలాల రైతుభరోసాపై సమీక్షిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పం దించకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామా ల్లో రైతు భరోసా ఇవ్వాలని ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తులేకలాన్, మాజీ ఎంపీపీ కృపేశ్, మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు ఆధ్వర్యంలో ఎలిమినేడులో, ఉప్పరిగూడలోఆందోళనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మంగళవా రం రైతు వేదికల్లో నిర్వహించిన సంబురాల్లో భాగంగా శివారు ప్రాంతాల రైతులకూ రైతుభరోసా ఇస్తున్నట్లు ప్రకటించి..ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరంతదితర ప్రాం తాల్లోని రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం ప్రారంభించింది. బుధవారం సాయంత్రంలోగా మిగిలిన రైతులకు రైతు భరోసా అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు తెలిపారు.
43వేల మందికి రూ.55 కోట్లు..
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, బాలాపూర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంకర్పల్లి, గండిపేట, శంషాబాద్మండలాల్లోని సుమారు 43వేల మంది రైతులు రైతుభరోసాకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రూ. 55 కోట్లను రైతుభరోసాగా అందించాలని ప్రభుత్వం ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే..
జిల్లాలోని తొమ్మిది శివారు మండలాల్లో వ్యవసాయం చేయడంలేదన్న సాకుతో ప్రభుత్వం రైతుభరోసాను ఎగ్గొట్టాలని యత్నించింది. అయితే దీనిపై తాము వెం టనే స్పందించి శివారు మండలాల్లో సాగవుతున్న పంటల వివరాలను పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి అందించాం. రైతులకు కచ్చితంగా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాలని..లేకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించాం. అయినా ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అనుసరించడంతో అనేక గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దిగొచ్చి రైతుభరోసాను విడుదల చేసింది. కానీ, అర్హులందరికీ ప్రభుత్వం రైతుభరోసా పంపిణీ చేయకుండానే సంబురాలు చేసుకోవడం ఆక్షేపణీయం. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. కాంగ్రెస్ హయాంలో వ్య వసాయం దండుగలా మారింది. రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. కొందరికే చేసింది. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని, ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదు. రైతులకు వెంటనే బోనస్ పంపిణీ చేయాలి. లేకుంటే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తాం.
-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే