మేడ్చల్, డిసెంబర్28(నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం నగదును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి రోజు బుధవారం 16,798 మంది రైతుల ఖాతాల్లో రూ.4 కోట్ల 10 లక్షల 89 వేల నగదు జమైంది. జిల్లా వ్యాప్తంగా 34,474 మంది రైతులు ఉండగా రైతుబంధు పథకం కింద 33.73 కోట్ల నగదును రైతులకు అందజేయనున్నారు. రైతుబంధు పథకం నగదు బ్యాంకు ఖాతాలలో జమ చేయడంతో రైతులు సంతోషంగా యాసంగి పంట సాగు పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ సాయంతో వ్యవసాయం ఇష్టంగా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం సాగు చేసేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అలాగే పంటలకు గిట్టుబాటు ధర సైతం కల్పిస్తుండటంతో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నాం.
– పెద్దబాల్రెడ్డి, మురహర్పల్లి
రైతుల కష్టాన్ని గుర్తించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్సారే.. పంట సాయం అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. రైతుబంధు పథకం, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిండంతో పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం.
– కృష్ణ, నర్సంపల్లి
కేసీఆర్సార్ దయ వల్లే వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏడాదికి రెండు సార్లు పంటల పెట్టుబడి కోసం రైతుబంధును ఇస్తూ సీఎం సారు ఆదుకుంటుండు. దీంతో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నాం. రాష్ర్టానికి సీఎం కేసీఆర్సారే ఉండాలని కోరుకుంటున్నాం.
– మోతె లక్ష్మయ్య, పూడూర్